Sunday, February 6, 2011

తిరుపతిలో ఇక 'చిరు' హవా!


తిరుపతి, ఫిబ్రవరి 6: కాంగ్రెస్ పార్టీలో పీఆర్‌పీ విలీనమైన నేప«థ్యంలో ఆ పార్టీ అధినేత చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుపతిలో ఇకపై ఆయన మాటే ఎక్కువగా చెల్లుబాటయ్యే అవకాశముంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మారిపోవడం, పార్టీ అధినాయకత్వంతో బలమైన సంబంధాలు కలిగిన నేపథ్యంలో తిరుపతి నియోజకవర్గ పరిధిలో ఇక చిరంజీవి మాటకు విలువ పెరుగుతుందనే అభిప్రా యాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎమ్మెల్యేగా చిరంజీవి మాటకు ప్రాధాన్యం వుంటుంది.

టీటీడీ పాలకమండలి, తుడ పాలకవర్గాలు ఖాళీగా వుండడంతో పాటు కార్పొరేషన్ ఎన్నికలు సమీపంలోనే జరగనుండడం చిరంజీవి వర్గీయుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. వాస్తవానికి టీటీడీ, తుడ పాలకవర్గంలో స్థానం కోసం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో ఈ పోస్టులను భర్తీ చేయకుండా అలాగే ఉంచేశారు. తీరా కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాకైనా తమ కోరిక తీరుతుందని ఆశించే క్రమంలో తిరుపతి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవి కాంగ్రెస్‌లో చేరిపోవడంతో ఈ పోస్టుల కోసం పోటీ పడేవారిలో పీఆర్‌పీ నాయకులు కూడా చేరారు.

ఈ పదవులు ఎవరిని వరించినా, అది చిరంజీవి అభీష్టం మేరకే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక అధికార యంత్రాంగం సైతం చిరంజీవి కనుసన్నల్లో నడవనుంది. నిన్నటి వరకు చిరంజీవిని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా మాత్రమే చూసిన అధికారులు ఇకపై అధికారపార్టీలో అతి కీలకమైన నేతగా గుర్తించకతప్పదు.అయితే చిరంజీవి పీఆర్‌పీ ఎమ్మెల్యేగా ఉన్నా కాంగ్రెస్ ఎంపీ చింతామోహన్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ తదితరులతో స్నేహంగా ఉన్నారు. ఈ క్రమంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, సాధారణ పరిపాలన విషయాల్లో ఈ వర్గాల మధ్య ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు తక్కువేనని చెప్పవచ్చు.

take By: Andrajyothi

0 Comments:

blogger templates | Make Money Online