Sunday, February 6, 2011

పీఆర్పీకి తెర ‘చే’ తీర్థం.. ‘మెగా’ విలీనం

పీఆర్పీకి తెర ‘చే’ తీర్థం.. ‘మెగా’ విలీనం

chirusirన్యూఢిల్లీ: దాదాపు 30 నెలల కిందట ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన తన పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైందని ‘ప్రజారాజ్యం’ పార్టీ అధినేత చిరంజీవి ఆది వారం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మో హనరెడ్డి వల్ల రాబోయే ప్రమాదాన్ని చిరంజీవి ద్వారా ఎదుర్కోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో 50నిమిషాలు సమావేశ మైన అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు.‘కాంగ్రెస్‌, పిఆర్‌ిపీ రెండూ కూడా సామాజిక న్యాయంకోసమే పోరాడుతున్నందున, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఉన్నతమైన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విలీనం నిర్ణయం తీసుకున్నాం’ అని చిరంజీవి చెప్పారు. ‘ిపీఆర్‌పీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని నిర్ణయించాం.

sonia-gandiఏ షరతూ లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. షరతులేం లేవు’ అని చిరంజీవి చెప్పారు. సోనియాగాంధీ నివాసం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవ హారాల ఇన్‌ఛార్జి ఎం వీరప్ప మొయిలీ ఈ సందర్భంగా మాట్లాడుతూ - ‘చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీ నం చేశారు. ఇప్పుడాయన కాంగ్రెస్‌ కుటుంబ సభ్యు డయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో చిరంజీవిని కలిసి,ఆయనను సో నియాగాంధీతో చర్చలకు ఆహ్వానించిన రక్షణమంత్రి ఎకే ఆంటోనీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘జగన్మో హనరెడ్డి బెడదను ఎదుర్కొ నేందుకే ఈ చర్య తీసుకు న్నారా?’ అని అడగ్గా, ‘మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. కాం గ్రెస్‌ను బలపరిచేందుకే ఈ చర్యని’ మొయిలీ చెప్పారు.

స్వార్థం లేదు
Chiru-moilyతనకు ఎలాంటి స్వార్థపూరితమైన ఉద్దేశాలు లేవని, ఎలాంటి ముందస్తు షరతులు లేకుండానే విలీనానికి అంగీకరించామని చిరంజీవి స్పష్టం చేశారు. ‘నేనేదీ ఆశించడం లేదు. అసలా ఉద్దేశమే లేదు. ఇప్పుడెలా ఉన్నానో, ఇక ముందూ అలాగే ఉంటాను’ అని చిరంజీవి తెలిపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో చేరుతారా?- అని విలేకరులు అడగ్గా చిరు ఈ విధంగా స్పందించారు.

0 Comments:

blogger templates | Make Money Online